మహబూబ్నగర్ పట్టణంలోని కొత్త గంజి, మదీనా మసీద్ ప్రాంతాల్లో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. రైల్వే డబ్లింగ్ పనులను పరిశీలించి స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. రైల్వే సేఫ్టీ వాల్ కారణంగా తాగునీరు, డ్రైనేజీ సమస్యలను కాలనీవాసులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే, రెవెన్యూ అధికారులు సమన్వయంతో త్వరగా పరిష్కరించాలని ఎంపీ ఆదేశించారు.