గోధుమ గడ్డి రసంలో విటమిన్లు (A, C, E), మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. రోజూ పరిగడుపున 30ml రసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువును తగ్గిస్తుంది.