VZM: బొబ్బిలి ఐ.సి.డి.ఎస్. ఆధ్వర్యంలో CDPO జాగాన విజయలక్ష్మి సోమవారం మండలంలోని కారాడ గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి పాల ప్రాముఖ్యత, పోషకాహారం, తల్లి పిల్ల సంరక్షణ తదితర అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వ్వైజర్ ఎన్.ప్రభావతి, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.