నిజామాబాద్ పట్టణంలోని 20వ డివిజన్లో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం డివిజన్ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. బాలల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ న్యాలం సునీతా రాజు, ICDS సూపర్వైజర్ చైతన్య, అంగన్వాడీ సూపరిండెంట్ ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు.