SRH స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు బాదిన అతడు, తాజాగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అర్థ శతకంతో మెరిశాడు. కేవలం 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన IPL కెరీర్లో 10వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో క్లాసెన్ స్కోర్లు: 31, 52, 62, 39, 40.