జగిత్యాలలో జనగణన- 2027 విజయవంతానికి ఎంపికైన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శనివారం శిక్షణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఖచ్చితమైన గణాంకాలు దేశాభివృద్ధికి కీలకమన్నారు. ఇంటింటి వివరాల సేకరణ, డిజిటల్ నమోదు, గోప్యత పరిరక్షణపై అవగాహన కల్పించారు. సమయానికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.