VZM: పట్టణంలోని ఘోషా ఆసుపత్రిలో (ప్రభుత్వ మహిళా ఆసుపత్రి) జరుగుతున్న వరుస దొంగతనాలపై ఎస్పీ ఏఆర్ దామోదర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ బృందం ఎస్పీ ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై లక్ష్మణరావు శనివారం ఘోషా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిఘా పెంచుతామని చెప్పారు.