IPL 2026లో భాగంగా GTతో జరిగిన మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ (101*) సంచలన శతకంతో ముంబై 199 పరుగులు చేసింది. అయితే, గుజరాత్ కేవలం 100 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు మొత్తం కలిసి 100 పరుగులు చేస్తే.. తిలక్ వర్మ ఒక్కడే 101 రన్స్ చేశాడు. దీంతో IPLలో ప్రత్యర్థి జట్టు కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ప్లేయర్గా తిలక్ నిలిచాడు.