ASF: పెంచికలపేట్ మండలం ఎల్లూర్ కి చెందిన దివాకర్ తన సెల్‌ఫోన్ పాత పోలీస్ స్టేషన్ నుంచి వైన్స్ షాపు వెళ్లే మార్గంలో పోగొట్టుకోగా బొంబాయిగూడకు చెందిన తులసిరాంకు దొరికింది. నిజాయితీ చాటుకున్న తులసీరామ్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్ అప్పగించినట్లు SI తెలిపారు. యజమాని ఆధారాలు పరిశీలించిన అనంతరం దివాకర్‌కు మొబైల్ అప్పగించినట్లు పేర్కొన్నారు.