NGKL: పదర మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో వంద మంది కూలీలతో ఉపాధి పనులు చేపట్టాలని ఏపీవో ఆంజనేయులు ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి చేరుకోవాలని సూచించారు. క్షేత్ర సహాయకులు ఎన్.ఎం.ఎం.ఎస్ యాప్ ద్వారా కూలీల ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్ రేనయ్య, పలువురు కూలీలు తదితరులు పాల్గొన్నారు.