MNCL: ఈనెల 22న అన్ని పాఠశాలలు, కళాశాలలలో ధరిత్రి దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్ కలెక్టరేట్లో DEO యాదయ్యతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలలో నిర్వహించనున్న ధరిత్రి దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలన్నారు.