శ్రీరాముడిని, హిందూ ధర్మాన్ని కించపరిచారనే ఆరోపణలతో నటుడు ప్రకాష్ రాజ్‌పై నటి కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆమె తీవ్రంగా మండిపడింది. ప్రకాష్ రాజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆయన సినిమాలను అడ్డుకుంటామని, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.