BHPL: నిన్న నస్తూరూపల్లి సభ ముగించుకుని హైదరాబాద్ వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డిని భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్, నేతలు కలిశారు. భూపాలపల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పని చేయాలని జిల్లా అధ్యక్షుడికి సీఎం సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.