ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు. ‘బుమ్రా ఎందుకు తొలి ఓవర్ వేయడని చాలామంది అడుగుతుంటారు. కానీ అతని 151 మ్యాచ్ల కెరీర్లో కేవలం 8-9 సార్లు మాత్రమే తొలి ఓవర్ వేశాడు. బుమ్రా ఒక ప్రత్యేకమైన బౌలర్. అతన్ని జట్టుకు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటాం. అతనికంటే మెరుగైన బౌలర్ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు’ అని కొనియాడాడు.