ADB: ప్రభుత్వం అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MP నగేశ్ సూచించారు. పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీల కోసం అత్యాధునిక వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, MLA వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి నిన్న ప్రారంభించారు. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో వైద్యసేవలు మరింత మెరుగుపడతాయని MP నగేశ్ పేర్కొన్నారు.