KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అజయ్‌పై ధ్వజమెత్తారు. పువ్వాడ అజయ్ తన రాజకీయ స్వార్థం కోసం పార్టీలు మారుతూ, అక్రమంగా భూములు రెగ్యులరైజ్ చేయించుకున్నారని రాయల ఆరోపించారు.