HYD: మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారాన్ని ఆయన కోడలు ప్రీతి రెడ్డి ఖండించారు. తాము బీజేపీలో చేరడం లేదని, పార్టీ మార్పుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. AICT యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకే భేటీ అయినట్లు తెలిపారు. మల్లారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతారని, తాను అన్ని పార్టీల నేతలను కలవడం సాధారణం అన్నారు.