ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కు తగ్గించింది. మార్కెట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ-50 20,500 పాయింట్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 15 శాతం క్షీణించొచ్చని పేర్కొంది.