BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని కోరారు. వేతన సవరణలు అమలు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని సూచిస్తూ సమ్మెకు సీపీఐ మద్దతు ప్రకటించారు