KDP: కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈనెల 26న అనంతపురం లలిత కళా పరిషత్లో నిర్వహించనున్న బీసీ గళం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. గ్రామస్థాయి వరకు వెళ్లి బీసీల సమస్యలపై చైతన్యం కల్పించాలని జగన్ సూచించారు.