సిద్దిపేట జిల్లా దుద్దెడలో వెలసిన స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మహిమలకు నిలయంగా మారింది. కాకతీయ సామంత రాజు యాదవ రెడ్డి నిర్మించిన ఈ 800 ఏళ్ల నాటి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఇక్కడి తీర్థం (జలం) అత్యంత శక్తివంతమైనదని ప్రజల నమ్మకం. ఈ పవిత్ర జలాన్ని పొలాల్లో చల్లితే పురుగులు, చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు.