NRML: నిర్మల్ పట్టణానికి చెందిన ఎస్. వర్దిని రెడ్డి ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ కేటగిరిలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్న ఈమె మంగళవారం వెలువడిన ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 211వ ర్యాంకును సాధించింది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ర్యాంకు సాధించిన ఈమెను పట్టణవాసులు అభినందించారు.