ఖమ్మంలో నేడు సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావును ఎన్ఐఏ విచారించనుంది. రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్, గాదే ఇన్నయ్య అరెస్టుపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైంది. అనారోగ్య కారణాల దృష్ట్యా హైదరాబాద్ రాలేనని ఆయన తెలపడంతో, అధికారులు ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.