CTR: దీర్ఘకాలంగా టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని PRTU ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని నాయకులు కోరారు. పెండింగ్ డీఏలను చెల్లించాలన్నారు. టెట్ పరీక్ష రద్దు చేయాలని, జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో చేయాలన్నారు. అనంతరం డీఆర్వో మోహన్‌కు వినతిపత్రం అందించారు.