VKB: విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించాలని గెజిటెడ్ HM సునీత పేర్కొన్నారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని సూచించారు.