NZB: బోధన్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకుల పాఠశాలలో సెలవుల సందడి నెలకొంది. ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థినులు అందరూ ఎంతో ఉత్సాహంగా తమ సామాన్లతో ఇంటిబాట పట్టారు. గత కొన్ని రోజులుగా చదువులు, పరీక్షలతో బిజీగా గడిపిన విద్యార్థినులు, సెలవులు రావడంతో తమ తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామాలకు బయలుదేరారు.