NTR: డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నందిగామ రూరల్ సర్కిల్ ఆధ్వర్యంలో కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సేవించే అనుమానితులు, పాత నేరస్తులను సమీకరించారు. వారి వద్ద నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా రూరల్ డీసీపీ, నందిగామ ఏసీపీ పాల్గొన్నారు.