WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి శనివారం చల్లని నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల కోసం గ్రీన్ మ్యాట్ ఏర్పాటుచేసి, పనివేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తరచూ నీరు త్రాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూలీలకు సూచించారు.