SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (103) అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలోనే అతడు టీ20 ఫార్మాట్లో 1000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కేవలం 25 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అంతేకాకుండా, అతి పిన్న వయసులో (15 ఏళ్ల 29 రోజులు) ఈ రికార్డును అందుకున్న ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.