SRPT: హుజూర్నగర్ పద్మశాలి భవనంలో అఖిల భారత యాదవ మహాసభ నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నియోజకవర్గ అధ్యక్షుడిగా మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా శంభయ్య, కోశాధికారిగా రమేష్, టౌన్ అధ్యక్షుడిగా గొట్టే నాగరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సైదులు పాల్గొని, యాదవ సంఘం నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.