BDK: జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్వోలతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేసవికాలంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు.