మెగా హీరో సాయి దుర్గా తేజ్ ‘విరూపాక్ష’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని, ఇప్పుడు ‘సంబరాల యేటిగట్టు’లో నటిస్తున్నాడు. బైక్ ప్రమాదం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్తో ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. దీని తర్వాత సుజీత్, సందీప్ వంటి దర్శకులతో తేజ్ సినిమాలు చేయనున్నట్లు టాక్. మూడేళ్ల నిరీక్షణ తర్వాత తేజ్ వరుస సినిమాలతో రావడం ఫ్యాన్స్‌కు పండగే.