KRNL: ఆదోని నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పెసలబండ స్కీమ్ నుంచి బైచిగేరి, బసరకోడు వంటి గ్రామాలకు వారానికి ఒకసారే నీటిని సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోరు నీటిని కలపడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు.