ప్రకాశం: ఆంగ్ల భాష దినోత్సవం సందర్భంగా గురువారం మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంగ్ల భాష ఉపాధ్యాయులను సత్కరించారు. ఆంగ్ల భాష ప్రాముఖ్యతను పాఠశాల డైరెక్టర్ ప్రకాష్ రావు వివరించారు. ప్రస్తుత సమాజంలో ఆంగ్లం ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మస్తాన్ వల్లి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.