AP: మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సీఎం చంద్రబాబు వైఖరిని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, విపక్షాలను ఎండగడతామని చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు.