SKLM: వైకాపా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు పోలీసులు మంగళవారం నోటీసులు అందజేశారు. పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా ఈ నెల 9న పార్టీ శ్రేణులతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టిన ఘటనపై పోలీసులు వివరణ కోరారు. ఎస్సై రాము స్థానిక పార్టీ కార్యాలయంలో తిలక్‌కు నోటీసులు ఇచ్చారు.