KNR: ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవోనెం.38 విడుదల చేసింది. ఒకే చోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.