NGKL: తాడూర్ మండలం పర్వతాయపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ భీముడు నాయక్, ఉప సర్పంచ్ ఉంద్యల కవిత, వార్డు సభ్యులు, మరియు బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.