MDK: చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో 10 గ్రామాల పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో చిన్నశంకరంపేట విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా, మల్లుపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు.