TG: అధికారమే లక్ష్యంగా BRS అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నుంచి ప్రజల్లో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగిత్యాల సభతో ప్రజల్లోకి వచ్చిన కేసీఆర్.. ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 27న BRS భవన్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.