MBNR: హన్వాడ మండల కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న ‘మహనీయుల జాతర’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, బీ.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.