నల్లగొండ మండలం దండెంపల్లిలో ఉపాధి హామీ పనులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, మండల కార్యదర్శి గోలి నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పథకాన్ని ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించాలని, కూలీల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.