AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, TDP మధ్య ప్లెక్సీ వివాదం నెలకొంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేదని మాజీ MLA వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నేత పెండెం దొరబాబుపై వర్మ సీరియస్ అయ్యారు. మట్టి వ్యాపారం చేసుకునేవాడు మళ్లీ చెరువులు తవ్వడానికి వచ్చాడని మండిపడ్డారు. TDP ఎవరిపై పోరాటం చేసిందో వాడే వచ్చి పెత్తనం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.