TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదిలాబాద్, మెదక్, మహబూబ్నగర్, భద్రాచలం, ఖమ్మంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 39.8 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.