JN: రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని BRS జిల్లా నాయకులు పల్లా సుందరరామ్ రెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొనుగోళ్ల ప్రక్రియలో ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసిన మక్కలు, వడ్లను వెంటనే తరలించాలని, లేకపోతే నిరసన చేపడుతామన్నారు.