MHBD: మరిపెడ మండలం గిరిపురం శివారులో బుధవారం వ్యవసాయ బావిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఇటుకల గడ్డ తండాకు చెందిన సంగీత(23)గా గుర్తించారు. ఈ నెల 29న ఆమె వివాహానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.