ఎండలో ప్రయాణించేవారు తగు మొత్తంలో నీటిని తీసుకోవాలి. కాచి చల్లార్చిన, ఫిల్టర్ చేసిన మంచినీరు తీసుకోవచ్చు. దాహం తీరాక కొద్దిసేపటి తర్వాత జ్యూస్ తాగొచ్చు. మరీ చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదికాదు. ఎక్కువ వేడి లేదా ఎక్కువ చలి ఆరోగ్యానికి హానికరం. డీహైడ్రేషన్ ఉన్నవారు అస్సలు కూల్డ్రింక్స్ తాగొద్దు. టీ, కాఫీ, ఆల్కాహాల్ వంటివి వేసవిలో తీసుకోకపోవటం ఆరోగ్యానికి మంచిది.