JGL: ధర్మపురి సమీప కమలాపూర్ ఫ్లాట్స్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. సమాచారం అందుకున్న CI రామ్ నరసింహారెడ్డి, SI మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు చీరాలకు చెందిన యోహాన్ అలియాస్ మహేష్(28)గా గుర్తించారు. కూలి పనుల కోసం ధర్మపురికి వచ్చిన అతడు అధిక మద్యం సేవించి వడదెబ్బకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.