MNCL: బెల్లంపల్లి పట్టణం, రడగంబాలబస్తీలో రూ.1.50 కోట్ల నిధులతో చేపట్టిన జాతికుంట చెరువు సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి, కమిషనర్ సంపత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు.