TG: ఆర్టీసీ జేఏసీ నేతల వెనక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హరీష్ చెప్పడంతోనే ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు వెళ్లారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశామని.. అయినా కూడా సమ్మెకు వెళ్లారంటే అర్థం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఉద్ఘాటించారు. ఈవీ బస్సులు అనేవి కేంద్రం నిర్ణయమన్నారు.